ఊరు ఉద్దండు ?ఇంకొ అవినీతి కథశ్రమయేవ జయతే...!మిత్రులారా జీవితం అనే ప్రయాణంలో, బతుకు బండి ఎన్నో లోతు గుంతలపై నడక సాగిపొంచాల్సిందే... ఒక మరు మూలా ఊరు, అంత బాగున్నా, అనామకంగా, పిచ్చిదానికి ఆ ఊరి రచ్చబండకున్నంత గుర్తిపు ఆమెది. నాయినెవరో తెల్వదు దానికో కొడుకు, సదువు సంస్కారం అయింతా లేదు. ఊర్లో ఉన్న ఇండ్లల్లో అడుక్కొచ్చిన బువ్వ తిని, బువ్వకోసం ఊరంతా లోడపెట్టి తిరుగుడు, చావడే వాడికి డాబా ఇల్లు, అమ్మ అంటే మాత్రం అతి ప్రేమ, ఉన్నట్టుండి అనారోగ్యంతో, ఆమె చనిపోతది. దహనసంస్కారాలు చెయ్యాలని, ఊర్లోని వారంతా మానవీయ దృక్పధంతో ఖర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అప్పటి వరకు అమ్మ... కానరాని బాధతో, కన్నీళ్ల ఆలోచనతో,అపుడు మిగిలిన అన్నం తెచ్చిపెడుతుంది తిని అక్కడే ఉంటున్న అచేతనుడుగా కాలం గడుపుతున్నాడు. ఒక నాడు ఉన్నట్టుండి మదేమేక్కిన ఏనుగు గొలుసులతో సహా తెంపుకొని, అన్ని ఊర్లోని పంటలను తొక్కుకుంటూ ఈ ఊర్లోకి కాలు పెట్టింది. ఊర్లోని వాళ్లందరికీ భయమేసి, చేతికి వచ్చిన పంట ఏనుగు మూలంగా నాశనం అయిపోతట్టుందని. గ్రామస్తులందరూ చావడి దగ్గరికి వచ్చి భయాన్ని వ్యక్తం చేస్తూ బాధపడుతున్నారు, వాళ్ళందర్నీ గమనిస్తున్న మిగిలిన బువ్వ తినేటోడు పారేసే అన్నం తిన్నోడు, బలవంతుడుగా పెరిగినాడు అటుగా పరిగెత్తుకుంటూ వస్తున్న మదమెక్కిన ఏనుగు ఘింకారాలు పెడుతున్న చప్పుడుకు ఊర్లోని వారంతా భయబ్రాంతులకు గురై, చావడి దగ్గర గుమికూడి ఉన్నవారంతా భయంతో ఇండ్లలోకి దూరి తలుపులేసుకున్నారు!. చావడికాడున్న అడుక్కుతినే దాని కొడుకు ఆ పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగు గొలుసును పట్టి ఆపి మొగడైండు, మొనగాడైనాడు. అప్పటిదాంకా పిచ్చిదాని కొడుకైన సోమరిపోతూ, దున్నపోతు ,మందగస్థుడు మదమెక్కిన ఏనుగు పరుగును ఆపగలిగిన బలవంతుని చూసారు. ఊర్లోని పెద్దమనుషులకు వాణ్ణి అభినందించాలో, ఆదరించాలో తెల్వక వాణ్ణి తిట్టుడు మొదలుపెట్టారు!!!. చుట్టున్న గ్రామా పెద్దలు వచ్చి వాణ్ణి మెచ్చకుంటున్నారు. చేతికొచ్చిన మా పంటలను కాపాడినందుకు తోచినంత వాడికిచ్చిపోతున్నారు, పొగడ్తలతో ముంచెత్తిపోతున్నారు, మీ ఊర్లో మదమెక్కిన ఏనుగు పరుగును ఆపగలిగే మొనగాడు ఉండడం మీ ఊరి గొప్పతనం అని పలు గ్రామాల ప్రజలు కోకొల్లలుగా తీరని ముచ్చటగా వేనోళ్ళ పొగుడుతున్నారు. మీ ఊరి పేరు, కీర్తి పతాక స్థాయికి చేరిపోయింది. వీణ్ణి చూడడానికి అనేక గ్రామాల పెద్దలు వస్తున్నారు కానీ గ్రామస్థులు పెద్దలు సాహసాన్ని ఊరికి చేసిన ఉపకారాన్ని గుర్తించలేక చిన్న చూపుతో చూస్తున్నారు. వీని అయ్యేవాడో అమ్మ ఒక పిచ్చిదిగా బతికి సాచింది . కులం ఏందో, మతం ఏందో విని బతకంత తెల్సినోల్లం . ఏ గతి లేని స్థితి లేని కొడుక్కి ఇంత పేరు వచ్చింది, మన ఊరికి ప్రఖ్యాతి తెచ్చాడని నమ్మలేక విష పన్నాగం పన్ని ఊరి చావడి దగ్గరకి రప్పించి, ఏం రా...! ఆ ఊరోళ్లు , ఈ ఊరోళ్లు వచ్చి పోతున్నారు, అవ్వి ఇవ్వి ఇచ్చి పోతున్నారు తీసుకుంటున్నావు బాగానే వుంది, మరి మీ అమ్మ... అనగానే అ .... అమ్మ అ .... అమ్మ అని గుర్తుకొచ్చింది. చెప్పమన్నట్టుగా అతృతతో అడుగుతున్నాడు . మా దగ్గర అప్పు చేసింది ఎట్లా తీరుస్తావ్రా నువ్వు ... ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి ఆదుకున్న బువ్వ తింటున్నావ్, దున్నపోతు లెక్క బాలసినవ్ బలమైన ఏనుగును ఆపినవ్ మరి మీ అమ్మ చేసిన అప్పు ఎవరు తీరుస్తారు బిడ్డా...? అని ఊరి పెద్దలు లేని అప్పుని అంటగడతారు. వానికొక పీకారు పిడుగు పడ్డట్టు అయితది, అయ్యా మా అమ్మ చేసిన అప్పు ఏందో తెల్వదు, ఎంతనో తెల్వదు, మీరేం చెప్తే అది చేస్తా... మీరెట్లా చెప్తే అట్లా ఇంటా మా అమ్మ.... అప్పు చేసింది ఎంతైనా తీరుస్తా... అంటాడు. అప్పుడు ఒక గొడ్డలిచ్చి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునే కూలోన్నీ చేసిన కుళ్ళు నా కొడుకులు ఊరిపెద్దమనుషులు...
Social Plugin