భువనగిరి శ్రీనివాస్ నేత
భువనగిరి శ్రీనివాస్ నేత
భువనగిరి వంశ చంద్రమా !
![]() |
| BHONGIR SRINIVAS Reference Links: BHONGIR SRINIVAS NETHA |
భువనగిరి అలేకస్వామి, ఈశ్వరమ్మల శుద్దీముక్తి ఫలంగా దివి 25-08-1966 శనివారం మధ్యాహ్నమున ప్రథమ సంతానంగ జన్మించిన మీరు ఊరి పేరుగా కలిగి ఇంటికి వన్నె తెచ్చిన ధీశాలి మీరు. మీరు జన్మించినపుడు మీ అమ్మానాన్నలు ఊహించి ఉండరు మా శ్రీనివాస్ జాతీయ స్థాయికి ఎదిగి కార్మికరత్నగా కీర్తించబడతరని.
భువనగిరి వంశోద్బవ మీ చిన్ని తనములో తల్లిని కోల్పోయి తల్లడిల్లారు. చిరు ప్రాయములో పనిలోకి దిగాల్సిన పరిస్థితులు మిమ్మల్ని రాటుదేల్చాయి. ప్యాలాల బట్టీలో మీ పాల బుగ్గలకు మసి మకిలి. సైకిల్ రిపేర్ గా మీ జీవిత సైకిల్ ను రిపేరు చేసుకునే నిపుణత మీకు చిన్నతనంలోనే వంట బట్టింది .
బాగాయత్ హై స్కూల్ మీ విద్యాబ్యాసం నాలుగవ తరగతి కానీ, జీవితమనే పాఠశాలలో మీరు చదివిన చదువు ఎవ్వరికి అబ్బదు. ఆ లోక జ్ఞానమే పదుగురికి సహాయం చెయ్యాలనే తపన, ఎదో సాధించాలనే మీ దీక్షా, కార్య దక్షత , మీ పట్టుదలలే మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చాయి. ఎదో అద్భుతము సాధించి మీతో పాటు మీ వెంట ఉండే వారికి మేలు జరగాలనే మీ తపన హర్షణీయము.
ఎన్నో వంకలు విరిగిన దూలాన్ని వడ్రంగి సరిచేసి దానిని ఉపయోగకరంగా ఎలా తయారు చేస్తాడో! అలానే మీరు నేర్చుకున్న వడ్రంగి పనితనము మీ జీవితము ఎన్నో వంకలు తిరిగినా! వాటిని సవరించుకుంటూ నేడు ఈ స్థాయికి ఎదిగిన జీవితం తరువాత తరాలకు ఆదర్శనీయము.
ఓ ఆదర్శ విప్లవవాదీ !
ఆలోచనలో, ఆచరణలో, సిద్ధాంతాలలో భిన్న దృవాలుగా ఉన్న విప్లవము, సంప్రదాయలను రెండిటిని సమంగా ఆదరిస్తూ ఆయా సందర్భాలలో ఒకటి పైచేయిగా అవుతూ రెండు పడవలలో సమంగా ప్రయాణించిన వింత జీవిని నీవు, విప్లవ నాయకులైన కాళోజి, గద్దర్ లాంటి వ్యక్తులతో సహచర్యము నేర్పుతూనే RSS BJP లాంటి సంస్థలతో చురుకుగా పాల్గొనడం. మీ భిన్న మనస్తత్వాన్ని, రెండంశాములు మిలో జీర్ణించుకు పోయాయని తెలుస్తుంది. ఆయా వ్యక్తులు సంస్థలసాంగత్యంతో మీ కవితలు పదునెక్కి ఆయా సందర్భాలలో ప్రముఖుల చేత ప్రశంచించబడ్డాయి.
ఆయా సంఘటనలతో విప్లవవాదిగా అరెస్టు కాబడి 1990 కాశ్మీరులో జాతీయ జెండావిష్కరణ లో అయోధ్య రామ మందిర్ నిర్మాణం కొరకు "కరసేవ" లో పాల్గొన్న మీరు ప్రశంసనీయులు.
ఆదర్శ గృహస్తు :
25-06-1988 లలిత సుగుణాలగుణరాశియైన "లలిత" ను పెడ్లాడి నేటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని మీ వైవాహిక జీవితము ధన్యము . ఏ పొరపొచ్చాలు లేకండా మీ వైవాహిక జీవితము ఇలా గడవడానికి మీ సహధర్మ చారిని లలిత గారి త్యాగము ఎంతో గణనీయమైంది. మీరు ఆయా సంస్థలలో పని చేయుటకు ఆమెగారి సహాయము ఎంతో మీకందింది. మిరూపొందిన సత్కారాలు, సన్మానాలలో సాగ భాగము మీ సహా ధర్మ చారికే దక్కాలి.
ఇక మీ సంతానము కుతురు "స్వాతి" ఉత్తమ ఇల్లాలుగా రాణిస్తుంది. మీ ఆదర్శాలకు అనుగుణంగా పేర్లు పెట్టుకున్న మీ పెద్ద కుమారుడు "సావర్కర్ " నిజంగా వీర సావర్కర్ లా జాతీయ భావాలు కలిగే దేశభక్తిని ప్రస్ఫుటంగా ప్రకటించేలా వృద్ధిలోకి రావాలి. రెండవ కుమారుడు "వేదేశ్వర్ " తన జ్ఞాన సమపార్దనతో మీకు, మీ ఆదర్శాలను కొనసాగించాలని కోరుకుందాము.
పద్మశాలి కులబాంధవా ! పద్మ శాలి కులరత్నమా!
8 జులై 1997 న "నేత - మోత " పద్మశాలి హక్కుల పోరాట సమితి ఆవిర్భవింపజేసి అన్ని తానై రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన వారు మీరు. నేతన్నల ఆకలి చావులపైన ఎన్నో సదస్సులు నిర్వహించి , కార్మిక , కర్షకులను , మేధావులను తేడా లేకుండా అన్ని వర్గాలను ఆలోచింపజేసి మీ మేధోమధనము ముదాహావము.
అనేక పోరాటాల ఫలితంగా నేతన్నల రుణమాఫీని చేయించిన ఘనత మీ ఖాతాలోకి వస్తుంది. నేతన్నల ఆకలి చావులు నిరసిస్తూ భువనగిరి ఖిల్లా పైన జాతీయ పండుగ దినాన నల్ల జండా ఎగురవేసిన మీ తెగువ ధైర్య సాహసాలు ఎంతో ప్రశంసనీయం .
కార్మిక కర్షక పక్షపాతి!:
నిరంతరము కార్మికుల , కర్షకుల అభ్యున్నతికి చింతుస్తూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలోచింపజేస్తున్న మీ మాటలు , చేతలు, కవితలు అజరామరమవుతాయి. ఏవ్ మిమ్మల్ని కార్మిక పక్షపాతిని చేసాయి.
అత్యుత్తమ దేశభక్తుడా !
మీ ముందు తరము పరతంత్య్రములో ఉన్న భారతమాత దాస్య శృంఖలాలు పగలగొట్టడానికి తమ సర్వస్వాన్ని త్యాగము చేసి స్వాతంత్రము తీసుకువచ్చారు. మీకు ఆ అవకాశము లేదని కాబోలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో తెలంగాణ సాధన కోసము స్వాతంత్య్ర సమరయోధుల చలో ఢిల్లీ కార్యక్రమ శిబిరానికి "40" రోజులు కో- కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించి భారతమాత ముద్దు బిడ్డలైన స్వాతంత్య్ర సమరయోధులకు సేవలందించి పరోక్షంగా భారత మాత కు సేవ చేసిన పూజనీయులు మీరు . అత్యుత్తమ దేశభక్తి మీకే స్వంతము.
కార్మిక రత్న
మీ ఆలోచనలు , పనులు , సర్వము సమాజ శ్రేయస్సును కోరేవే మీరు ఇండియన్ నేషనల్ యూనియన్ వారి "జాతీయ కార్మిక రత్న" అవార్డు అందుకున్న శుభ సందర్భముగా మరియు మీ వివాహ మహోత్సవ రజతోత్సవాల సందర్భంగా "భువన భారతి " ఆధ్యాత్మికత , సాహిత్య , సాంస్కృతిక సేవా సంస్థ అభినందన మందారమాల అందుకొండి.
భువనగిరి శ్రీనివాసునికి భువన భారతి మనస్ఫూర్తిగా ఇస్తున్న చిరు కానుక.
ఓ ఆదర్శ విప్లవవాదీ !
యుక్త వయస్సులో అందరూ ఆకర్షితులైనట్లే మీరు విప్లవం వైపు మొగ్గారు. మీ జీవితాన జరిగిన సంఘటనలే మిమ్మల్ని ఆలా ఆకర్షితుడిని చేశాయి. కామ్రేడ్ శేషన్న సహచర్యము దానికి తోడైంది. అయినా వారి మాట మీదున్న గౌరవము మిమ్మల్ని మల్లి సాంప్రదాయ వాదిని చేశాయి. "ఉద్యమం లోకి రావొద్దూ ! ఉద్యమాలు మిమ్మల్ని బ్రమ పెట్టాయి " అన్న మాటలు మిమ్మల్ని ఆలోచింపచేశాయిభిన్నదృక్పధాలను కలిగిన ప్రజ్ఞాశాలి,
ఆలోచనలో, ఆచరణలో, సిద్ధాంతాలలో భిన్న దృవాలుగా ఉన్న విప్లవము, సంప్రదాయలను రెండిటిని సమంగా ఆదరిస్తూ ఆయా సందర్భాలలో ఒకటి పైచేయిగా అవుతూ రెండు పడవలలో సమంగా ప్రయాణించిన వింత జీవిని నీవు, విప్లవ నాయకులైన కాళోజి, గద్దర్ లాంటి వ్యక్తులతో సహచర్యము నేర్పుతూనే RSS BJP లాంటి సంస్థలతో చురుకుగా పాల్గొనడం. మీ భిన్న మనస్తత్వాన్ని, రెండంశాములు మిలో జీర్ణించుకు పోయాయని తెలుస్తుంది. ఆయా వ్యక్తులు సంస్థలసాంగత్యంతో మీ కవితలు పదునెక్కి ఆయా సందర్భాలలో ప్రముఖుల చేత ప్రశంచించబడ్డాయి.
ఆయా సంఘటనలతో విప్లవవాదిగా అరెస్టు కాబడి 1990 కాశ్మీరులో జాతీయ జెండావిష్కరణ లో అయోధ్య రామ మందిర్ నిర్మాణం కొరకు "కరసేవ" లో పాల్గొన్న మీరు ప్రశంసనీయులు.
ఆదర్శ గృహస్తు :
25-06-1988 లలిత సుగుణాలగుణరాశియైన "లలిత" ను పెడ్లాడి నేటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని మీ వైవాహిక జీవితము ధన్యము . ఏ పొరపొచ్చాలు లేకండా మీ వైవాహిక జీవితము ఇలా గడవడానికి మీ సహధర్మ చారిని లలిత గారి త్యాగము ఎంతో గణనీయమైంది. మీరు ఆయా సంస్థలలో పని చేయుటకు ఆమెగారి సహాయము ఎంతో మీకందింది. మిరూపొందిన సత్కారాలు, సన్మానాలలో సాగ భాగము మీ సహా ధర్మ చారికే దక్కాలి.
ఇక మీ సంతానము కుతురు "స్వాతి" ఉత్తమ ఇల్లాలుగా రాణిస్తుంది. మీ ఆదర్శాలకు అనుగుణంగా పేర్లు పెట్టుకున్న మీ పెద్ద కుమారుడు "సావర్కర్ " నిజంగా వీర సావర్కర్ లా జాతీయ భావాలు కలిగే దేశభక్తిని ప్రస్ఫుటంగా ప్రకటించేలా వృద్ధిలోకి రావాలి. రెండవ కుమారుడు "వేదేశ్వర్ " తన జ్ఞాన సమపార్దనతో మీకు, మీ ఆదర్శాలను కొనసాగించాలని కోరుకుందాము.
పద్మశాలి కులబాంధవా ! పద్మ శాలి కులరత్నమా!
8 జులై 1997 న "నేత - మోత " పద్మశాలి హక్కుల పోరాట సమితి ఆవిర్భవింపజేసి అన్ని తానై రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన వారు మీరు. నేతన్నల ఆకలి చావులపైన ఎన్నో సదస్సులు నిర్వహించి , కార్మిక , కర్షకులను , మేధావులను తేడా లేకుండా అన్ని వర్గాలను ఆలోచింపజేసి మీ మేధోమధనము ముదాహావము.
అనేక పోరాటాల ఫలితంగా నేతన్నల రుణమాఫీని చేయించిన ఘనత మీ ఖాతాలోకి వస్తుంది. నేతన్నల ఆకలి చావులు నిరసిస్తూ భువనగిరి ఖిల్లా పైన జాతీయ పండుగ దినాన నల్ల జండా ఎగురవేసిన మీ తెగువ ధైర్య సాహసాలు ఎంతో ప్రశంసనీయం .
కార్మిక కర్షక పక్షపాతి!:
నిరంతరము కార్మికుల , కర్షకుల అభ్యున్నతికి చింతుస్తూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలోచింపజేస్తున్న మీ మాటలు , చేతలు, కవితలు అజరామరమవుతాయి. ఏవ్ మిమ్మల్ని కార్మిక పక్షపాతిని చేసాయి.
అత్యుత్తమ దేశభక్తుడా !
మీ ముందు తరము పరతంత్య్రములో ఉన్న భారతమాత దాస్య శృంఖలాలు పగలగొట్టడానికి తమ సర్వస్వాన్ని త్యాగము చేసి స్వాతంత్రము తీసుకువచ్చారు. మీకు ఆ అవకాశము లేదని కాబోలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో తెలంగాణ సాధన కోసము స్వాతంత్య్ర సమరయోధుల చలో ఢిల్లీ కార్యక్రమ శిబిరానికి "40" రోజులు కో- కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించి భారతమాత ముద్దు బిడ్డలైన స్వాతంత్య్ర సమరయోధులకు సేవలందించి పరోక్షంగా భారత మాత కు సేవ చేసిన పూజనీయులు మీరు . అత్యుత్తమ దేశభక్తి మీకే స్వంతము.
కార్మిక రత్న
మీ ఆలోచనలు , పనులు , సర్వము సమాజ శ్రేయస్సును కోరేవే మీరు ఇండియన్ నేషనల్ యూనియన్ వారి "జాతీయ కార్మిక రత్న" అవార్డు అందుకున్న శుభ సందర్భముగా మరియు మీ వివాహ మహోత్సవ రజతోత్సవాల సందర్భంగా "భువన భారతి " ఆధ్యాత్మికత , సాహిత్య , సాంస్కృతిక సేవా సంస్థ అభినందన మందారమాల అందుకొండి.
భువనగిరి శ్రీనివాసునికి భువన భారతి మనస్ఫూర్తిగా ఇస్తున్న చిరు కానుక.
ఇట్లు
భువనభారతి
(ఆధ్యాత్మికత , సాహిత్య , సాంస్కృతిక సేవా సంస్థ)
అధ్యక్షులు : గడ్డం నర్సింహా రెడ్డి
కార్యదర్శి :
మెరుగు సదానందం
Published By Bhongir sawarkar
Published By Bhongir sawarkar

Social Plugin