RTC సమ్మె

అమ్మ తెలంగాణమా...!
హక్కులు అమలు చెయ్యమంటే
 అనగదొక్కవట్టే
ఉన్నోని  పాలనలో కంటే
పోయినోళ్లే బాగుండే
బంగారు తెలంగాణంటూ
బ్రమలెన్నో కల్పించే,
అప్పుల పాలాయెగదరో
మన రాష్ట్రం - ఆత్మా హత్యల
పర్వమాయెరో మన రాష్ట్రం
అణిచివేత బతుకులయెరో
మన రాష్ట్రం - అన్నలు
లేకుంటాయేరో మన రాష్ట్రం లో
అసలు తెలంగాణ వాదులారా,
ఎటు బోతిరి మీరంతా...
నకిలీ మకిలి గాళ్ళంతా
తెలంగాణ వాదులయె
పోరాడిన వాళ్ళకేమో
 బువ్వ లేదాయె
                                                                    _భుశ్రీ