ప్రస్తుత పాలన కంటే??!
పొయ్యినోనీ పాలనే బాగుండే!!?
Date:03/11/2019
Telanganagovt-bhongir-srinivas-bhongir-sawarkar
"బస్సు గోస RTC BUS Problemsr" : {"బస్సును నేను RTC బస్సును నేను
తెలంగాణ ప్రజలారా..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులారా...!
మీ సమస్యల పరిష్కారం కావడానికి
నన్ను మీరు ఎన్ని సార్లు
తగల పెట్టలేదు?
ఎన్ని వందల సార్లు
నన్ను భందు పెట్టలేదు?
ఎన్ని సార్లు
బందులుపెట్టి తగలబెట్టిన
మీ సమస్యలు పరిష్కారానికి తొవ్వ చూపింది నేనే కదా!!!
ఎన్ని వేల రాస్తారోకోలకు
మార్గదర్శిని నేనే కదా!?
లక్షల సమస్యలకు పరిష్కారం చూపిన దాన్ని
కోట్ల మందిని రవాణా చేసిన దాన్ని
నా సమస్య పరిష్కారం చేయమంటే
మీకు వచ్చిన బాధ ఏంది?
మీకు వచ్చిన రోగం ఏంది?
సమాజంలో ప్రాణం ఉన్నోడు
ఎవ్వడైనా నా ప్రయాణం తోటే
మీ జీవితాలు వెలిగించిన బస్సును
ఇప్పుడు నా వెలుతురులో ఉండి,
నన్ను"కారు"చీకట్లో వేయాలని
కుట్ర చేస్తున్నారు
నేను మోసుకెళ్లిన ఒకప్పటి విద్యార్థులారా
ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగులు లారా
నన్ను గాడిదలగా చూస్తునారు
ఇవ్వాల కారు ఉంది అని...
నకరాల్ చేస్తున్నారు.
రేపు.. మీరు నాకు సహకరించకుంటే ?!
మీ కారు - నకరాలు బేకర్ గా తయారు అవుతారు
నేను గమ్యస్థానం చేర్చే దిక్సూచినీ...
నా పేరే బస్సు.
నా సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలి..
లేకపోతే మీ భవిష్యత్ తరాల మీ పిల్లలకు
నా ఉసురు కచ్చితంగా ముడుతుంది..
జై తెలంగాణ అన్నది .. ఇందుకేనా...!!?"